TG: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మొయినాబాద్ డ్రగ్స్ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. ఇవాళ రోహిత్, రితేశ్, నమిత్ శర్మ కస్టడీపై HYDలోని రాజేంద్రనగర్ కోర్టు తీర్పు ఇవ్వనుంది. నిందితులను ఏడు రోజులు పోలీసు కస్టడీకి అనుమతివ్వాలని పోలీసులు పిటిషన్ వేయడంతో కోర్టులో వాదనలు జరిగాయి. అయితే కోర్టుకు వరుస సెలవులు ఉండటంతో కస్టడీ పిటిషన్పై తీర్పు ఇవాళ వెలువడనుంది.