హైదరాబాద్లోని చాదరాఘాట్లో చార్మినార్ టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు చేశారు. స్టెరాయిడ్స్ ముఠా గుట్టురట్టు చేసి, 20 స్టెరాయిడ్ ఇంజెక్షన్లు, 3 ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో షేక్ సమీర్, వసీం ఖాన్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ నుంచి కొరియర్ ద్వారా తెప్పించి విక్రయాలు చేస్తున్నట్లు గుర్తించారు.