MLG: గోవిందరావుపేట మండలం పస్రా గ్రామంలోని రాజీవ్ కాలనీలో రూ.35 లక్షల నిధులతో అంతర్గత సీసీ రోడ్ నిర్మాణ పనులకు మంత్రి సీతక్క శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. గ్రామాలలో మౌలిక వసతులను కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ దివాకర్ టిఎస్, SP, DFO, మార్కెట్ చైర్మన్ తదితరులు ఉన్నారు.