»High Court Verdict On Detention Of Congress War Room Volunteers Action Should Be Taken Against Police
Telangana high court: ఆ పోలీసులపై చర్యలు తీసుకోవాలి..హైకోర్టు ఆదేశం
సీఎం కేసీఆర్, కేటీఆర్, కవిత ఫొటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాల్లో షేర్ చేశారంటూ డిసెంబరులో ముగ్గురు కాంగ్రెస్ వార్ రూమ్ వాలంటీర్లను పోలీసులు అరెస్టు చేశారు. అయితే దీన్ని సవాల్ చేస్తూ సీనియర్ నేత మల్లురవి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ అనంతరం హైకోర్టు.. పలువురు నేతలను అక్రమంగా నిర్బంధించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
High Court verdict on detention of Congress war room volunteers. Action should be taken against police
Congress war room: నిజ నిజాలు తేలకుండా ఆరోపణలతో కొందరు పోలీసులు దూకుడుగా వ్యవహరిస్తుంటారు. ఇలాంటి పరిణామల్లో కొన్ని సార్లు న్యాయస్థానాల నుంచి చివాట్లు పడుతుంటాయి. తాజాగా ఇలాంటి సంఘటనే తెలంగాణ పోలీసులకు ఎదురైంది. కాంగ్రెస్ వార్ రూమ్(Congress war room) వాలంటీర్ల నిర్బంధంపై తెలంగాణ హైకోర్టు(High Court) కీలక ఆదేశాలు జారీ చేసింది. వాలంటీర్ల నిర్బంధంపై విచారణ చేపట్టిన హై కోర్టు నిబంధనలకు విరుద్ధంగా పోలీసులు వ్యవహరించారని వెల్లడించింది. ఈ నేపథ్యంలో అక్రమాలకు పాల్పడిన ఆ అధికారులపై చర్యలు తీసుకోవాలని సీపీని హైకోర్టు ఆదేశించింది.
సీఎం కేసీఆర్(KCR), కేటీఆర్, కవిత ఫొటోలను మార్ఫింగ్ చేసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారంటూ గత డిసెంబరులో ముగ్గురు కాంగ్రెస్ వార్ వాలంటీర్లను పోలీసులు అరెస్టు చేశారు. ఆ క్రమంలో వారిని అక్రమంగా నిర్బంధించారంటూ కాంగ్రెస్ సీనియర్ నేత మల్లురవి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం తాజాగా ఈ తీర్పు వెలువరించింది.
రాష్ట్రంలో గెలుపే లక్ష్యంగా పనిచేస్తున్న కాంగ్రెస్ తమ స్ట్రాటేజీలో భాగంగా గాంధీభవన్‌లో వార్ రూమ్‌ను ఏర్పాటు చేసింది. ఎన్నిక ప్రచారాల్లో అభ్యర్థులకు కీలక సూచనలు ఇచ్చేందుకు, పార్టీ విధానపరమైన నిర్ణయాలు జరిగిందుకు ఈ వార్ రూమ్ పనిచేస్తోంది. వ్యూహాలు రచించేందుకు, కీలక నిర్ణయాలను పార్టీ నాయకులతో పంచుకునేందుకు రాష్ట్రంలోని అనుభవజ్ఙులైన పార్టీ నాయకులను వాలంటీర్లుగా తీసుకున్నారు. వీరితో చర్చించడానికి కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి(Mallu Ravi)ని నియమించారు.