»If The Temperature Rises By Two Degrees There Will Be A Threat To India And East Pakistan
Temperature: రెండు డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగితే ముప్పు తప్పదు
వాతావరణ కాలుష్యం కారణంగా భూతాపం పెరిగిపోతుంది. మరో రెండు డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగితే భారత్‌తో పాటు తూర్పు పాకిస్థాన్ తీవ్రమైన సమస్యలను ఎదుర్కొవలసి వస్తుందని తాజాగా ఒక నివేదిక హెచ్చరించింది.
Temperature: ప్రపంచవ్యాప్తంగా భూతాపం భారీగా పెరుగుతుంది. కోల్‌కతా, ఢిల్లీ వంటి నగరాల్లో వాతావరణ మార్పుల వల్ల ఉష్ణోగ్రతలు మారుతున్నాయి. ప్రస్తుతం ఉన్న ఉష్ణోగ్రత కంటే రెండు డిగ్రీలు పెరిగితే భారత్, తూర్పు పాకిస్థాన్ పరిణామాలను ఎదుర్కొవలసి వస్తుందని ప్రొసీడింగ్స్ ఆఫ్ నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ తాజాగా హెచ్చరికలు జారీ చేసింది. వాతావరణ మార్పుల వల్ల సింధు లోయలోని ప్రజలు ఇప్పటికే తీవ్రమైన వేడి, తేమని ఎదుర్కొంటున్నారు. ఇంకో రెండు డిగ్రీలు ఉష్ణోగ్రత పెరిగితే దాదాపు 2.2 బిలియన్ల మంది ప్రజలు తీవ్రమైన వేడి, తేమను ఎదుర్కొంటారు. అప్పుడు శరీరాన్ని సహజసిద్ధంగా చల్లపర్చుకోలేని పరిస్థితి ఏర్పడుతుందని తెలిపింది.
తీవ్రమైన వడగాల్పులు, వేడి, గుండె పోటు సమస్యలు, అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటారు. సుదీర్ఘ వేసవి, తక్కువ రోజులు చలికాలం ఉండటంతో పాటు వ్యవసాయం, ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుందని హెచ్చరించింది. ప్రస్తుతం 50ఏళ్లకొకసారి వచ్చే విపత్తులు ఈసారి నుంచి 10ఏళ్లకు ఒకసారి సంభవిస్తాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. భూతాపం తగ్గాలంటే దాదాపు 20 నుంచి 30 ఏళ్లు పడుతుందని అధ్యయనాలు తెలుపుతున్నాయి. ప్యారిస్ ఒప్పందం 2015 ప్రకారం భూతాపాన్ని 1.5డిగ్రీల మేర తగ్గించాలని లక్ష్యంగా 195 దేశాలు సంతకం చేశాయి. కానీ 2030 నాటికి 1.5డిగ్రీల మేర పెరుగుతుందని ఇంటర్‌గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్ తెలిపింది.
ఉష్ణోగ్రత రెండు డిగ్రీలు పెరిగితే భారత్, తూర్పు పాకిస్థాన్ దేశాల్లో వడగాల్పులు తీవ్రంఅవుతాయి. కర్బన ఉద్గారాలు ఎక్కువ విడుదలకావడంతో పాటు గాలి నాణ్యత తగ్గుతుంది. హిందూ మహాసముద్రం త్వరగా వేడెక్కి భారీ వర్షాలు కురుస్తాయి. వానాకాలం ఎక్కువగా ఉంటుందని నివేదికలో పేర్కొన్నారు. దేశంలో ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల భూమి తేమను కోల్పోతుంది. క్రమంగా కరువు పరిస్థితులు ఎక్కువవుతాయని పరిశోధనలో చెప్పింది. పారిశ్రామికీకరణకు ముందు నుంచే ఉష్ణోగ్రతలు 1.1 డిగ్రీల మేర పెరిగాయని తెలిపింది. కార్బన్-డై-ఆక్సైడ్, మీథేన్ వంటి వాతావరణాన్ని వేడెక్కించే వాయువుల విడుదల ఆరంభమైంది. బొగ్గు, కలప, సహజ వాయువులను మండించడమే ఇందుకు ప్రధాన కారణమని నివేదికలో తెలిపింది.