Bigg Boss హౌస్ నుంచి నయని పావని ఎలిమినేట్.. కన్నీళ్లు పెట్టుకున్న కంటెస్టెంట్లు
బిగ్ బాస్ హౌస్ నుంచి నయని పావని ఎలిమినేట్ అయ్యింది. ఆరు రోజుల్లో బానే ఆడినప్పటికీ ఓట్లు మాత్రం పడలేదు. నయని ఎలిమినేట్ అని తెలిసి కంటెస్టెంట్లు కన్నీళ్లు పెట్టుకున్నారు.
Nayani Pavani: ప్రతీ వారం లాగే నిన్న (ఆదివారం) ఎపిసోడ్లో కూడా ఎలిమినేషన్ జరిగింది. ప్రేక్షకులు నుంచి ఓట్లు తక్కువ రావడంతో అనూహ్యంగా నయని పావని (Nayani Pavani) ఎలిమినేట్ అయ్యింది. నిజానికి ఆరు రోజుల్లో ఎంత ఆడాలో అంత ఆడింది. ప్రేక్షకుల హృదయాల్లో చోటు లభించలేదు. ఆశించిన స్థాయిలో ఓట్లు పడలేదు. సో.. ఎలిమినేట్ కావాల్సి వచ్చింది. లాస్ట్ వీక్.. గౌతమ్‌ను సీక్రెట్ రూమ్‌లో ఉంచినట్టు ఉంచుతారెమోనని భావించారు. ఆమె జర్నీ చూడటంతో హౌస్ లోపల కంటెస్టెంట్లు ఏడవగా.. బయట కొందరు ప్రేక్షకులు కూడా బాధపడ్డారు.
యావర్ కెప్టెన్ కారణం కావడానికి కారణం కూడా నయని పావని (Nayani Pavani).. కెప్టెన్ టాస్క్‌లో భాగంగా తేజ బెలూన్‌లో గాలి తీయడంతో యావర్ కెప్టెన్ అవుతారు. నయని ఎలిమినేట్ అని తెలిసి కంటెస్టెంట్ల కూడా బాధ పడతారు. తేజ గురించి చెబుతూ.. తన అన్న అంటూ నయని కన్నీళ్లు పెట్టుకుంది. అమర్ దీప్, గౌతమ్ గురించి చెబుతూ బాధ పడింది. మరికొన్ని రోజులు ఉంటే బాగుండేదని అనుకుంది.
ప్రియాంక, శోభను మిస్ అవుతున్నానని చెప్పింది. యావర్, అర్జున్ అంతా బాధపడ్డారు. ఒక్క వర్షిణి గురించి గొడవ గురించి నయని చెప్పింది. ఆటను ఆటగా చూడాలిని కోరింది. చివరగా శివాజీ గురించి చెబుతూ.. చాలా కనెక్ట్ అయ్యాయని.. తన కూతురిలా చూసుకున్నాడని చెప్పుకొచ్చింది. ఫస్ట్ ఎలా మాట్లాడాలనే భయం ఉండేదని.. తర్వాత ఈజీగా కలిసిపోయామని నాగార్జునతో చెప్పింది. శివాజీ మాట్లాడుతూ.. ఒకవేళ ఛాన్స్ ఉంటే, తాను బయటకు వెళతానని, నయనిని లోపలికి తీసుకెళ్లాలని కోరాడు. హౌస్‌కు బై చెప్పగా.. దాదాపు అందరూ కంటెస్టెంట్లు ఎమోషనల్ అయ్యారు. ఆరు రోజుల్లోవర్షిణి ఆశించిన స్థాయిలో ఆడలేదు.. ఆమె ఎలిమినేట్ అవుతుందని అంతా అనుకున్నారు. కానీ అనూహ్యంగా నయని బయటకు వచ్చేసింది.