ప్రముఖ టాలీవుడ్ హీరో కళ్యాణ్ రామ్(nandamuri kalyan ram) యాక్ట్ చేస్తున్న డెవిల్ మూవీ నుంచి మరో క్యారెక్టర్ ను మేకర్స్ పరిచయం చేశారు. ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ ఫేమ్ మాళవిక నాయర్(malvika nair) ఈ చిత్రంలో మణిమేకల అనే పాత్ర పోషిస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే ఈ మూవీ థ్రిల్లర్ చిత్రామా లేదా పొలిటికల్ యాక్షన్ మూవీనా అనేది తెలియాల్సి ఉంది.
నిర్మాత అభిషేక్ నామా(ABHISHEK PICTURES)దర్శకత్వంలో ‘ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్’ అనే ట్యాగ్‌లైన్‌తో వస్తున్న ‘డెవిల్’ మూవీ నుంచి క్రేజీ అప్ డేట్ వచ్చింది. ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ ఫేమ్ మాళవిక నాయర్(malvika nair) ఈ పీరియడ్ యాక్షన్ మూవీలో హీరోయిన్గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ అమ్మడు నందమూరి కళ్యాణ్‌రామ్(nandamuri kalyan ram) సరసన మణిమేకళ క్యారెక్టర్లో చేయనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. క్యారెక్టర్ పోస్టర్లో మాళవిక నాయర్‌ని మణిమేకలాగా పరిచయం చేశారు. ఆమె గిరజాల జుట్టుతో రాజకీయ నాయకులు ధరించే బూడిద కాటన్ చీరను ధరించి కనిపిస్తుంది. చూపుడి వేలును చూపిస్తూ వార్నింగ్ ఇస్తున్నట్లు పోస్టర్లో కనిపిస్తుంది. మాళవిక రీసెంట్గా ‘ఫలనా అబ్బాయి ఫలనా అమ్మాయి’, ఆ తర్వాత ‘అన్ని మంచి శకునములే’ సినిమాలో కనిపించింది. తనకు కొత్తదనం చాలా ముఖ్యమని ఇటివల ఓ ఇంటర్వ్యూలో మాళవిక నాయర్ పేర్కొంది. తాను ప్రతిసారీ విభిన్నంగా చేయాలనుకుంటున్నానని తెలిపింది.
Introducing the stunning transformation of #MalvikaNair into Manimekala in the first look of #Devil – The British secret Agent.💥💥
అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై అభిషేక్ నామా కథ, దర్శకత్వంలో ఈ మూవీ వస్తుండగా.. పుష్ప, రాధే శ్యామ్, రావణాసుర వంటి చిత్రాలకు రచయితగా పనిచేసిన శ్రీకాంత్ విస్సా డైలాగ్స్ అందించారు. డెవిల్ చిత్రానికి సంగీతం హర్షవర్ధన్ రామేశ్వర్ అందించగా, ఛాయాగ్రహణం సౌందర్ రాజన్. ఈ మూవీ తెలుగుతో పాటు హిందీ సహా పలు భాషల్లో పాన్ ఇండియా లెవల్లో నవంబర్ 24న రిలీజ్ కానుంది.