»Vijay Devarakonda Parasuram Vd13th Movie Title Release Date Fix
VD13: విజయ్, పరశురామ్ మూవీ టైటిల్ రిలీజ్ డేట్ ఫిక్స్
గీతా గోవిందం క్రేజీ కాంబో మళ్లీ రాబోతుంది. విజయ్ దేవరకొండ హీరోగా పరశురామ్ దర్శకత్వంలో వస్తున్న మూవీ టైటిల్ విడుదల తేదీని మేకర్స్ ఫిక్స్ చేశారు. అక్టోబర్ 18న సాయంత్రం ఆరున్నరకు రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు.
Vijay devarakonda Parasuram vd13th movie title release date fix
స్టార్ హీరో విజయ్ దేవరకొండ(Vijay devarakonda) తన నెక్ట్స్ 13వ చిత్రం టైటిల్ విడుదల తేదీ ఖరారైంది. ఈనెల 18న సాయంత్రం 18:30కి విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రానికి పరశురామ్ పెట్ల(Parasuram) దర్శకత్వం వహిస్తుండగా..ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే మేకర్స్ ఈ విషయాన్ని ప్రకటిస్తూ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. అందులో విజయ్ దేవరకొండ ఓ స్కూల్ చిన్నారిని తీసుకెళ్తుండటం చూడవచ్చు. ఓ పోస్టర్లో విజయ్ కుడి చేతికి రక్తం మరకలు అంటుకుని ఉన్నాయి. అయితే ఫైట్ తర్వాత చిన్నారిని తీసుకెళ్తున్నారా అనే విషయం తెలియాల్సి ఉంది.
దిల్ రాజు(dil raju) శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వస్తున్న ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా యాక్ట్ చేస్తుంది. గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నారు. గీతా గోవిందం బ్లాక్ బస్టర్ ఎంటర్టైనర్ తర్వాత పరశురామ్, విజయ్ దేవరకొండ కాంబోలో వస్తున్న రెండో చిత్రం ఇది. ఈ క్రమంలో విజయ్ ఫ్యాన్స్ ఈ చిత్రంపై భారీగా అంచనాలు పెట్టుకున్నారు. ఇప్పటికే విజయ్ యాక్ట్ చేసిన గత రెండు చిత్రాలు లైగర్, ఖుషీ అభిమానులను పెద్దగా ఆకట్టుకోకపోవడంతో ఈ కాంబోపై హోప్స్ మరింత పెరిగాయి. ఈ నేపథ్యంలో పరుశురామ్.. విజయ్(vijay)కు మరో హిట్టు ఇస్తారా లేదా అనేది చూడాలి.