రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) ఇన్స్టాగ్రామ్ ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. అందులో ఆయనుకు కోటి మంది (పది మిలియన్ల మంది) ఫాలో అవుతున్నారు. ఇప్పుడు ఆ అకౌంటును ఎవరో హ్యాక్ చేశారు. ఇన్‌స్టా(Insta)లో ప్రభాస్ పేరును సెర్చ్ చేస్తుంటే.. ‘ఈ పేజీ అందుబాటులో లేదు’ అనే మెసెజ్ వస్తోంది. ఆయన ఖాతా హ్యాకింగ్(Hacking) కు గురైందా.. లేదా డి-యాక్టివేట్ చేశారా.. తెలియాల్సి ఉంది. మరోవైపు.. ఈ విషయం పట్ల ఆయన అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా, జులై నెలలో ఆయన ఫేస్బుక్ ఖాతా కూడా హ్యాక్‌కు గురైన సంగతి తెలిసిందే.
‘మనుషులు దురదృష్టవంతులు’ అంటూ ఆనాడు హ్యాకర్లు ఓ వీడియో (Video) షేర్ చేశారు.సామాజిక మాధ్యమాలను చాలా అరుదుగా వాడుతుంటారు నటుడు ప్రభాస్ (Prabhas). కేవలం సినిమా ప్రమోషన్స్ కోసమే ఆయన ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ ఉపయోగిస్తుంటారు. తాజాగా ఆయన ఇన్‌స్టా ఖాతా కనిపించడం లేదు.ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రభాస్ ప్రస్తుతం ‘సలార్ పార్ట్ (Salar Part) 1 సీజ్ఫైర్’, ‘కల్కి 2898 ఏడీ’ చిత్రాల్లో నటిస్తున్నారు. ప్రశాంత్‌నీల్ తీర్చిదిద్దుతోన్న ‘సలార్’ డిసెంబర్ నెలలో విడుదల కానుంది. వీటితోపాటు మారుతి డైరెక్షన్లో ‘రాజా డీలక్స్’, సందీప్ రెడ్డి (Sandeep Reddy) వంగాతో ‘స్పిరిట్’ మూవీలో ప్రభాస్ నటించనున్నారు.