»Tdp President Achennaidu Worried About Chandrababus Health He Made Sensational Comments That Jagan Should Take Full Responsibility For Whatever Happened To Him
Kinjarapu Atchannaidu: చంద్రబాబుకి ఏం జరిగినా సీఎం జగనే బాధ్యత వహించాలి
చంద్రబాబు ఆరోగ్యం ప్రమాదకరంగా ఉందని.. ఆయన ప్రాణాలకు ఏం జరిగినా సీఎం జగన్ బాధ్యత వహించాలని ఏపీ టీడీపీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు అన్నారు.
Kinjarapu Atchannaidu: టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి ప్రమాదకరంగా ఉందని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబు అరెస్ట్ వెనుక కుట్ర దాగి ఉంది. అతనికి ప్రాణహాని ఉందని, జైల్లోనే చంపేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు ఆరోగ్యం క్షీణిస్తుందని.. అయినా జైల్లో అతనికి సరైన వైద్యం అందించట్లేదన్నారు. చంద్రబాబు ఆరోగ్యంగానే ఉన్నారని డాక్టర్లు తప్పుడు రిపోర్ట్లు ఇస్తున్నారని మండిపడ్డారు. తండ్రి మెడికల్ రిపోర్ట్ ఇవ్వాలని లోకేశ్ అడిగినా.. జైలు అధికారి ఇవ్వడంలేదని అన్నారు.
చంద్రబాబును అరెస్ట్ చేసి 38రోజులు అవుతున్నా.. ఒక్క రూపాయి అవినీతి జరిగిందని నిరూపించలేదని గుర్తుచేశారు. ఒక్క ఆధారం కూడా చూపించలేకపోయారు. ప్రతి ఒక్కరూ చంద్రబాబు అరెస్ట్‌ను ఖండిస్తున్నారు. చంద్రబాబు ఆరోగ్యం ప్రమాదకరంగా ఉందని.. అతనికి ప్రాణానికి ఏదైనా హాని జరిగితే.. అందుకు సీఎం జగన్ పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై తనకు నమ్మకం లేదని.. బాబును ఎయిమ్స్‌కు తరలించి మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు.