Safety pin మింగిన 5 నెలల శిశువు.. ఏం జరిగిందంటే..?
కోల్‌కతాలో 5నెలల శిశువు సేఫ్టీ పిన్ను మింగేయడంతో శ్వాసనాళంలో ఇరుక్కుంది. ఆ బాలుడిని ఆస్పత్రికి తీసుకెళ్లగా ఆపరేషన్ చేసి పిన్నీసును విజయవంతంగా బయటకు తీశారు. దీంతో పేరంట్స్ ఊపిరి పీల్చుకున్నారు.
Swalled safety pin : కోల్‌కతాలో అయిదు నెలల బాలుడి శ్వాసనాళంలో పిన్నీసు ఇరుక్కుంది. హుగ్లీలోని జంగిపార ప్రాంతానికి చెందిన తల్లి సోదరులు ఆడుకుంటున్నారని మంచంపై ఆ బాలుడిని పడుకోబెట్టింది. ఆ సమయంలో బాలుడు పిన్నీసు మింగేశాడు. అప్పటి నుంచి ఆ బాలుడికి ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది రావడంతో ఏడ్చాడు. వెంటనే ఆస్పత్రికి తీసుకువెళ్లారు. శిశువుకి జలుబు వచ్చిందని డాక్టర్ చికిత్స చేశాడు. అయిన ఏడుపు ఆపలేదు. ఏకధాటిగా బిడ్డ ఏడవడంతో తల్లిదండ్రలు ఆందోళన చెంది కోల్‌కతా వైద్య కళాశాల ఆస్పత్రికి తీసుకెళ్లారు.
శిశువును ఈఎన్టీ విభాగంలో వైద్యుడు సుదీప్దాస్ పరివేక్షణలో చేర్చి వెంటనే ఎక్స్-రే తీయించారు. ఆ బాలుడి శ్వాసనాళంలో పొడవైన సేఫ్టీ పిన్ ఇరుక్కుందని ఆ స్కానింగ్‌లో తెలిసింది. అదృష్టం కొద్దీ ఆ పిన్నీసు శ్వాసనాళం లోపలికి వెళ్లలేదు. వెంటనే ఆ శిశువుకి ఆపరేషన్ చేయాలని డాక్టర్ సూచించారు. వైద్యులు 40నిమిషాల పాటు శస్త్రచికిత్స చేసి విజయవంతంగా సేఫ్టీ పిన్నీసును బయటకు తీశారు. ప్రస్తుతం బిడ్డ ఆరోగ్యంగా ఉన్నాడని వివరించారు.