W.G: ప్రజా రిపబ్లిక్ ఉద్యమం రూపొందించిన సంపద పునఃపంపిణీ ఉద్యమానికి ఉమ్మడి జిల్లాలకు చెందిన పలు వామపక్షాల నేతలు మద్దతు ప్రకటించారని దారిదీపం సంపాదకులు, ఉద్యమం కన్వీనర్ వర్మ తెలిపారు. ప్రముఖ కార్మిక నేత కలిదిండి భీమరాజు 93వ జయంతి సందర్భంగా తణుకు సురాజ్య భవన్లో ‘మోదీ రాజకీయం – ప్రజా ఉద్యమాలు’ అనే అంశంపై జరిగిన చర్చా గోష్ఠిలో ఆయన మాట్లాడారు.