దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా విజయవాడ కనక దుర్గమ్మను ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ (Governor Abdul Nazir) దంపతులు దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.గవర్నర్ దంపతులు అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అంతరాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి దర్శనానంతరం వేద పండితులు (Vedic scholars) ఆశీర్వచనాన్ని అందజేశారు. ఈవో చైర్మన్ అమ్మవారి చిత్రపటం, ప్రసాదం, శేషవస్త్రంను అందించారు.
ఇంద్రకీలాద్రిపై ఆదివారం తెల్లవారుజాము నుంచి దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు (Sharannavaratri celebrations) ప్రారంభమయ్యాయి. ఈ నెల 23 వరకు దసరా మహోత్సవాలు జరగనున్నాయి. తొమ్మిది రోజుల పాటు పది అలంకారాలలో కనకదుర్గమ్మ (Kanakadurgamma) భక్తులకు దర్శనమివ్వనున్నారు. మెుదటి రోజైన ఆదివారం శ్రీ బాలాత్రిపుర సుందరీ దేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఆదివారం తెల్లవారుజామున 3 గంటల నుంచి అమ్మవారి స్నపనాభిషేకం, అలంకరణ ప్రత్యేక పూజలు (Special Pujas) చేశారు. అనంతరం ఉదయం తొమ్మిది గంటల నుంచి అమ్మవారి దర్శనానికి భక్తులకు అనుమతిచ్చారు.
దేవీశరన్నవరాత్రి వేడుకల్లో భాగంగా అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఇంద్రకీలాద్రి (Indrakiladri) పై ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. కేశఖండన చేసుకున్న వారికి ప్రత్యేక ఏర్పాట్లు చేసింది దేవాదాయ శాఖ. అలాగే కొండచరియలు విరిగిపడిన దగ్గర గట్టి జాగ్రత్తలు తీసుకున్నారు. 3500 మంది పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ (Kottu Satyanarayana) వెల్లడించిన సంగతి తెలిసిందే.