అధికార బీఆర్ఎస్కు మరో బిగ్ షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్సీ బాలాసాని లక్ష్మీనారాయణ (Balasani Lakshminarayana) పార్టీకి రాజీనామా చేశారు.ఈ మేరకు తన రాజీనామా లేఖను సీఎం కేసీఆర్కు పంపించారు. గత కొంతకాలంగా అసంతృప్తిలో ఉన్న ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. బీఆర్ఎస్ (BRS) నుంచి టికెట్ ఆశించి భంగపడ్డ లక్ష్మీనారాయణ..కాంగ్రెస్ (Congress) తీర్థం పుచ్చుకోనున్నారు. ఆయన పార్టీ వీడటంపై ఖమ్మం బీఆర్ఎస్ శ్రేణులు విమర్శలు చేస్తున్నారు. ఇన్నాళ్లు పార్టీని అధిష్టానం సముచిత స్థానం కల్పించనప్పటికీ గుడ్ బై చెప్పడంపై మండిపడుతున్నారు.
సమస్యలు ఉంటే పార్టీలో చర్చించుకోవాలని కానీ, ఎన్నికల వేళ రాజీనామా చేసి పార్టీకి నష్టం చేకూర్చేలా ప్రవర్తించడం సరికాదని విమర్శలు చేస్తున్నారు.బిఆర్ఎస్ పార్టీ భద్రాచలం (Bhadrachalam) నియోజక వర్గ ఇంచార్జ్ గా బాధ్యతలు ఇచ్చినట్లే ఇచ్చి అకస్మాత్తుగా తొలగించింది. దీంతోపాటు తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ నేపథ్యంలో దీంతో అసంతృప్తితో ఉన్న బాలసాని బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు.
బిఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు పార్టీ అధినేత కెసిఆర్ (KCR) కు లేఖ పంపారు. కాగా, బాలసాని లక్ష్మీనారాయణ 1987లో టీడీపీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చాడు. 1987, జూలై 20వ తేదీన తొలిసారిగా పీఏసీఎస్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు.1995 నుంచి 2004 వరకు తొమ్మిదిన్నరేళ్లపాటు ఆయన డీసీసీబీ చైర్మన్(DCCB Chairman)గా బాధ్యతలు నిర్వహించాడు. 2015లో ఖమ్మం స్థానిక సంస్థల స్థానం నుండి టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసి సిపిఐ అభ్యర్థీ పువ్వాడ నాగేశ్వర్ రావుపై 31 ఓట్ల మెజార్టీతో గెలుపొందాడు.