పాక్‌తో హైవోల్టేజ్ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) దుమ్మురేపాడు. పేసర్ షాహీన్ ఆఫ్రిది బౌలింగ్‌లో తన ట్రేడ్ మార్క్ పుల్ షాట్‌కు అంపైర్ ఎరాస్మత్ (Umpire Erasmus) ఆశ్చర్యపోయారు. అలా ఎలా కొడుతున్నావని అడగ్గా రోహిత్ నవ్వుతూ (బైసెప్స్) కండలు చూపించాడు. పాకిస్థాన్‌తో నిన్న జరిగిన వరల్డ్ కప్ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అదరగొట్టాడు.
63 బంతుల్లో 86 రన్స్‌తో భారత్ విజయానికి బాటలు పరిచాడు. ఈ ఇన్నింగ్స్‌లో ఏకంగా ఆరు సిక్సులు బాదడంతో అహ్మదాబాద్(Ahmedabad)లోని మోదీ స్టేడియం దద్దరిల్లింది. అయితే, ఎనిమిదో ఓవర్లో రోహిత్, కవర్స్ మీదుగా బాదిన సిక్స్ ఏకంగా 90 మీటర్ల దూరానికి వెళ్లింది. మ్యాచ్‌కే హైలైట్ (Highlight) గా నిలిచిన ఈ సిక్స్‌ను చూసి అభిమానులు ఆశ్చర్యపోయారు. ఇక తన సిక్స్ చూసుకుని రోహిత్ శర్మలో కూడా ఆనందం కట్టలు తెంచుకుంది. రోహిత్ భారీ సిక్స్ ఈ దృశ్యం కూడా రోహిత్ అభిమానులను, క్రికెట్ ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగిస్తోంది.