టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కెరీర్‌పై మాజీ సెలెక్టర్ MSK ప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘ఒకానొక సమయంలో కోహ్లీ ఫామ్ కోల్పోయి, ఫిట్నెస్ విషయంలో కూడా ఇబ్బందులు పడుతున్నప్పుడు సెలెక్టర్లు అతడిని పక్కన పెట్టాలనుకున్నారు. కానీ ధోనీ ఒక్కడే కోహ్లీకి అండగా నిలబడి, విరాటే భారత క్రికెట్ భవిష్యత్తు అని నమ్మి అవకాశాలు ఇచ్చాడు’ అని వెల్లడించాడు.