ADB: కౌటాల మండలంలోని తాటినగర్ గ్రామానికి చెందిన డోంగ్రి శంకర్ కొన్ని నెలల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఆయనకు మంజూరు చేసిన రూ. 60 వేల CMRF చెక్కును ఆదివారం ఎమ్మెల్సీ దండే విట్టల్ లబ్ధిదారునికి అందజేశారు. సీఎం సహాయనిధి పథకం ద్వారా పేద ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.