Thalapathy Vijay: లోకేష్ కనగరాజ్, విజయ్ కాంబోలో రానున్న చిత్రం లియో. ఈ సినిమా గురించి విజయ్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఫ్యాన్ సినిమా రిలీజ్ అవుతుందంటే అందరికంటే ముందుగానే చూసేయాలని ఆతురత ఉంటుంది. ఇంతకుముందు మార్నింగ్ షోలు ఉండేవి. ఇప్పుడు సినిమా రిలీజ్ అవుతుందంటే స్పెషల్ షోలు వేస్తున్నారు. కానీ ఈ సినిమాకు తమిళ సర్కార్ షాక్ ఇచ్చింది. విజయ్ ఫ్యాన్స్‌కు ఇది బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే గ్రాండ్‌గా రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉన్న ‘లియో’ చిత్రానికి ఎలాంటి ప్రత్యేకమైన షోలు లేవని తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది.
రోజులో మొత్తం ఐదు షోలు నిర్వహించడానికి అవకాశం ఇస్తారని చిత్ర బృందం భావించింది. కానీ ప్రభుత్వం తెల్లవారు జామున షోలకు అనుమతి ఇవ్వలేదు. విజయ్ ఫ్యాన్స్‌కి ఇది నిరాశే. ప్రత్యేక షోలు వేయాలని అభిమానులు గొడవలు చేస్తే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. విజయ్ ఫ్యాన్స్ ఎవరైనా థియేటర్ యజమానులతో గొడవ పెట్టుకుంటే చర్యలు తీసుకోమని తమిళనాడు ప్రిన్సిపల్ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేసింది.