Garbho song written by Prime Minister Modi is going viral on social media
GarboSong: దేశమంతటా దసరా పండుగ సంబరాలు మొదలయ్యాయి. ఈ రోజునుంచి దుర్గా మాతను భక్తితో కొలిచే దసరా నవరాత్రుల (Dasara Navratri) సందడి షూరు అయింది. అయితే ఈ పండుగను పురస్కరించుకుని వివిధ రాష్ట్రాలలో వారి సంస్కృతి సంప్రాదాయాలను బట్టి నిర్వహించుకుంటారు. అలాగే గుజరాత్లో గర్భా డ్యాన్స్ చేస్తారు. గుజరాతీలు ఈ శరన్నవరాత్రులను ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. ఈ సందర్భంగా సంప్రదాయ నృత్యమైన గర్బా (Garba) చేస్తారు. తాజాగా గర్బా వీడియో(Garbo Video) పాట విడుదలైంది. ఈ సాంగ్‌ను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ (Narendra Modi) స్వయంగా రాశారు. ఇదే విషయాన్ని తన అధికారిక ఎక్స్ వేదికగా వెల్లడించారు.
ఈ పాటకు బాలీవుడ్ సంగీత దర్శకుడు తనిష్క్ బాగ్చీ స్వరాలు అందించగా, గాయని ధ్వని భాను శాలీ పాడారు. ఈ పాట విడుదలైందంటూ ఎక్స్ లో ధ్వని భాను ఓ పోస్ట్ పెట్టారు. దీనికి ప్రధాని మోడీ స్పందించారు. ఈ పాటను తెరకెక్కించిన టెక్నిషన్లకు కృతజ్ఞతలు తెలిపారు. కొన్ని సంవత్సరాల క్రితం ఈ పాటను రాసినట్లు గుర్తుచేసుకున్నారు. మాములుగానే మోడీ కవిత్వాలు, పాటలు రాస్తుంటారు. అయితే ఈ మధ్య ఆయనేమి రాయలేదని, ఈ గార్బో పాటను నవరాత్రుల సందర్భంగా విడుదల చేస్తున్నట్లు తెలిపారు.