»Secundarabad Yasodha Hosptial Docters Transplanted The Both Lungs This Is First Lung Transplanted In India
Record: యువకుడికి 2 ఉపిరితిత్తుల మార్పిడి..దేశంలో ఇదే మొదటిసారి
వ్యక్తిగత కారణాల వల్ల ఆత్మహత్య చేసుకుని చనిపోవాలని ఓ యువకుడు పురుగుల మందు తాగాడు. దీంతో రెండు ఊపిరితిత్తులు దెబ్బతినడంతో వైద్యులు సర్జరీ చేసి కుర్రాడికి పునర్జన్మ పోశారు. ఈ నేపథ్యంలో దేశంలోనే ఇలా రెండు ఊపిరితిత్తులను మార్పిడి చేయడం ఇదే మొదటిసారి కావడం విశేషం.
సెకన్ ఆలోచించకుండా పురుగుల మందు తాగి తీవ్ర ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లిన ఓ యువకుడికి యశోద ఆస్పత్రి సిబ్బంది అరుదైన ఆపరేషన్‌తో పునర్జన్మ ప్రసాదించారు. మహబూబాబాద్ జిల్లా ముర్రాయిగూడెంకు చెందిన రోహిత్(23) వ్యక్తిగత కారణాలతో పురుగుల మందు తాగాడు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న అతనిని సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో చేర్చారు. అప్పటికే చేయి దాటిపోయింది. ఆ మందు పూర్తిగా ఊపిరితిత్తుల్లోకి వెళ్లడం వల్ల యువకుడు పల్మనరీ ఫైబ్రోసిస్‌కు గురికావడం వల్ల కోలుకోలేని స్థితికి చేరాడు. దీంతో అతని కాలేయం, కిడ్నీలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఎన్నిరోజులైనా కూడా యువకుడి ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడలేదు.
రెండు ఊపిరితిత్తులను మెరుగుపరిస్తేనే యువకుడు బ్రతుకుతాడు ఏమోనని డాక్టర్లు భావించారు. శరీరంలో ఎలాంటి విషం లేదని నిర్ధారించుకున్న తర్వాత జీవన్‌దాన్‌లో నమోదు చేశాడు. జీవన్‌దాన్ సాయంతో అవయవాలను సేకరించి దాదాపు ఆరుగంటల పాటు శస్త్రచికిత్స చేసి యువకుడికి రెండు ఊపిరితిత్తులను మార్చారు. ఈ ఆపరేషన్‌ను సీనియర్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ వైద్య నిపుణులు డాక్టర్ హరికిషన్ గోనుగంట్ల వాళ్ల బృందం కలిసి విజయవంతం చేశారు. ఇప్పటికి ప్రపంచంలో నలుగురికే ఊపిరితిత్తుల మార్పిడి జరిగింది. భారతదేశంలో ఇదే మొదటిసారని డాక్టర్ హరికిషన్ తెలిపారు. రెండు ఊపిరితిత్తులను ఒకేసారి మార్పిడి చేసి రికార్డు సృష్టించారు. ఆ క్రమంలో ఆరోగ్యంగానే రోహిత్‌ను డిశ్చార్జ్ చేశామని తెలిపారు.