విమాన ప్రయాణాలు జరుగుతున్న సమయంలో విమానం (Aircraft) సడన్గా ఆగిపోయింది అంటే ఏదో సాంకేతిక సమస్య ఏర్పడటం లేదంటే ఇంకేదైనా ప్రాబ్లం రావడం జరుగుతూ ఉంటుంది. అయితే విమానం టేక్ ఆఫ్ అవ్వడానికి రెడీగా ఉంది అంటే చాలు సాంకేతిక సమస్య (Technical problem) లేకపోతే ఇక ఏ ఒక్కరి కోసం విమానం ఆగదు. గాల్లోకి రయ్ మంటూ దూసుకుపోతూ ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం ఒక విచిత్రమైన కారణంతో విమానం ఆగిపోయింది. ఈ విషయం తెలిసి ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు అని చెప్పాలి.
విమానాన్ని దోమలు అడ్డుకోవడం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా ? అవును, అక్టోబర్ 6న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.మెక్సికో(Mexico)లోని ఒలారీస్ ఫ్లైట్ గువ్వాడలహర నుంచి మెక్సికో సిటీకి ఉదయం నాలుగున్నర గంటలకు బయలుదేరాల్సి ఉంది. ఇంతలో దోమల గుంపు ప్రవేశించడంతో ప్రయాణికులు అందరూ కూడా ఉక్కిరిబిక్కిరి అయ్యారు. దీంతో విమాన సిబ్బంది మొత్తం స్ప్రేలు కొడుతూ దోమలను తరిమికొట్టేందుకు చెమటోడ్చారు.
దాదాపు మూడు గంటల ఆలస్యం తర్వాత మళ్లీ విమానం బయలుదేరింది. కీటకాలను నివారించే స్ప్రేలను తీసుకోని దోమల (Mosquitoes)పై యుద్ధం చేయడం మొదలు పెట్టారు. దీంతో విమానం మొత్తం స్ప్రే కారణంగా తెల్లని పుగతో కనిపిస్తుంది. ఈ మొత్తాన్ని ఫ్లైట్ (Flight) లోని పాసెంజర్స్ వీడియోలు తీశారు. ఆ వీడియోలో.. దోమల పై యుద్ధం చేస్తున్న విమాన సిబ్బందిని ప్రయాణికులు అభినందిస్తూ కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
A Volaris flight traveling within Mexico from Guadalajara to Mexico City on Friday, October 6, was delayed by more than two hours due to a mosquito infestation, local media reported. pic.twitter.com/wA4oyXZJTK