MDK: జిల్లాలోని రామాయంపేట పట్టణంలో నిర్వహించిన ‘దీన్ దయాల్ ఉపాధ్యాయ’ ప్రశిక్షణ కార్యక్రమంలో మూడు జిల్లాల బీజేపీ ఇంఛార్జ్ రంజిత్ మోహన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికీ చేరవేసి, పార్టీని బూత్ స్థాయి నుంచి బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.