AP: చిత్తూరు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డుప్రమాదంలో దంపతులు మృతి చెందారు. కప్పల్లె వద్ద వేగంగా వెళ్తున్న కారు.. అదుపుతప్పి లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దంపతులు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతులు అనంతపురం జిల్లాకు చెందిన దంపతులుగా గుర్తించారు.