సీఎం కేసీఆర్ (CMKCR) అనారోగ్యంతో బాధపడుతూ గత కొన్ని రోజులుగా ప్రభుత్వ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. బీజేపీ ఎంపీ బండి సంజయ్ (Bandi Sanjay) సీఎం ఆరోగ్యంపై అనారోగ్యంపై ఆందోళన చెందారు. దీంతో, సగటు అభిమాని ఆయనను చూసి చాలా రోజులే అయిపోయింది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ లేటెస్ట్ ఫొటో ఒకటి నెట్టింట్లో వైరల్గా మారింది. మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Minister Srinivas Goud) స్వయంగా దీన్ని పోస్ట్ చేశారు. తాజాగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ను మర్యాదపూర్వకంగా కలిసారు.మహబూబ్నగర్ నియోజకవర్గ అభివృద్ధిపై పూర్తి సమాచారంతో రూపొందించిన ‘పాలమూరు (Palamuru) ప్రగతి నివేదిక’ పుస్తకాన్ని సీఎంకు అందించారు.
ఈ క్రమంలో దిగిన ఫొటోను ఎక్స్ వేదికగా మంత్రి షేర్ చేశారు. ఇక, సీఎం కేసీఆర్ అక్టోబర్ 15 నుంచి ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించనున్నారు. హుస్నాబాద్(Husnabad)లో జరిగే భారీ బహిరంగ సభతో ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. ఆ రోజు ఉదయం అభ్యర్థులతో సమావేశం నిర్వహించి వారికి దిశానిర్దేశం చేయనున్నారు. అనంతరం బీ ఫాం అందజేస్తారు.ఎట్టకేలకు సీఎం కేసీఆర్ తాజా ఫొటో బయటకు రావడంతో అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఈ సందర్భంగా సీఎంతో మంత్రి ఫొటో దిగి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో అందరూ హ్యాపీగా ఫీలవుతున్నారు. ‘హమ్మయ్య.. ఎట్టకేలకు సీఎం కేసీఆర్ కనిపించారు’ అంటూ కామెంట్లు (Comments)పెడుతున్నారు. ముఖ్యమంత్రిని రాష్ట్ర ప్రజలు చూడక దాదాపు 24 రోజులు కావడం గమనార్హం.
హైదరాబాద్ ప్రతిభవన్ లో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారిని మర్యాదపూర్వకంగా కలిసి, మహబూబ్ నగర్ నియోజకవర్గం అభివృద్ధి పై సమగ్ర సమాచారం తో కూడిన పుస్తకాన్ని అందచేయడం జరిగింది. మహబూబ్ నగర్ లో జరిగిన అభివృద్ధిని శాఖల వారీగా, ఆకర్షణీయమైన ఫోటోలను పొందుపరిచి పుస్తకాన్ని… pic.twitter.com/pgZjEbQubd