ఉత్తరాంధ్ర బుర్ర కథ కళాకారిణి గరివిడి లక్ష్మి జీవితం ఆధారంగా రూపొందిస్తున్న చిత్రం ‘గరివిడి లక్ష్మి’. తాజాగా ఈ మూవీ నుంచి ‘కూసింది కోయగూర’ అంటూ సాగే పాట ప్రోమోను మేకర్స్ విడుదల చేశారు. పూర్తి పాటను మార్చి 24న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. గౌరీనాయుడు జమ్ము దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఆనంది ప్రధాన పాత్రలో కనిపించనుంది.