AP: మాజీమంత్రి బొత్స సత్యనారాయణను విజయనగరంలో పలువురు వైసీపీ ఎమ్మెల్సీలు, నేతలు పరామర్శించారు. ఇటీవల అనారోగ్యానికి గురైన ఆయన ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పలువురు నేతలు నేరుగా ఆయన నివాసానికి వెళ్లి ఆరోగ్య పరిస్థితి, యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.