JGL: గొల్లపల్లి మండలం వెనుగుమట్ల బొంకూర్లోని వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఇవాళ దర్శించుకున్నారు. పూజారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి, బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు తెలుసుకుని భక్తులకు సౌకర్యాలు కల్పించాలని సూచించారు. ఈనెల 23 నుంచి 25 వరకు బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి.