NRML: బైంసా మండలంలోని వాటోలి గ్రామానికి చెందిన నిహాల్ కెనరా బ్యాంకులో కస్టమర్ సర్వీస్ అసోసియేట్‌గా ఎంపికై గ్రామానికి గర్వకారణంగా నిలిచాడు. ఈ సందర్భంగా ఎంప్లాయ్ గ్రూప్ ఆధ్వర్యంలో ఆయనను ఘనంగా సన్మానించారు. సర్పంచ్ సాయినాథ్, తదితరులు పాల్గొని అభినందించారు. నిహాల్ విజయం యువతకు ప్రేరణగా నిలుస్తుందని పేర్కొన్నారు.