మాస్ మహారాజా రవితేజ లేటెస్ట్ పాన్ ఇండియా ఫిల్మ్ టైగర్ నాగేశ్వర రావు టైం స్టార్ట్ అయిపోయింది. ప్రస్తుతం ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నాడు రవితేజ. అయితే మాస్ రాజా, కెజియఫ్ హీరో యష్ పై చేసిన కామెంట్స్‌ను నెగెటివ్‌గా తీసుకున్నారు కొందరు. దీంతో రవితేజ పై మండిపడుతున్నారు.
అక్టోబర్ 20న బాలయ్యకు పోటీగా వస్తున్నాడు మాస్ రాజా. టైగర్ నాగేశ్వర రావు సినిమాను యంగ్ డైరెక్టర్ వంశీ డైరెక్ట్ చేస్తున్నాడు. స్టూవర్ట్‌పురం గజ దొంగ టైగర్ నాగేశ్వర్ రావు బయోపిక్‌గా ఈ సినిమా తెరకెక్కింది. బాలీవుడ్ బ్యూటీ కృతిసనన్ చెల్లెలు నుపుర్ సనన్ హీరోయిన్గా నటిస్తుంది.. గాయత్రి భరద్వాజ్ సెకండ్ రోల్ ప్లే చేస్తోంది. ఇప్పటికే రెండు పాటలు రిలీజ్ చేయగా.. ఇప్పుడు థర్డ్ సింగిల్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ‘ఇచ్చేసుకుంటాలే’ సాంగ్‌ను అక్టోబర్ 12న రిలీజ్ చేయనున్నారు. మరోవైపు ప్రమోషన్స్ స్పీడప్ చేసిన రవితేజ.. ప్రస్తుతం బాలీవుడ్లో చక్కర్లు కొడుతున్నాడు.
అక్కడ శిల్పాశెట్టితో స్టెప్పులేసిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అలాగే.. ఇంటర్య్వూలో మన స్టార్ హీరోల గురించి చేసిన కామెంట్స్ కూడా వైరల్ అవుతున్నాయి. హిందీలో ఒక ఇంటర్వ్యూలో యష్ గురించి మాట్లాడుతూ.. ‘అతను చాలా లక్కీ, KGF సినిమా అతనికి పడింది’ అనే మాట అన్నాడు మాస్ రాజా. దీంతో.. కన్నడ యష్ ఫ్యాన్స్, యష్ లక్కీ కాదు, తను ఎంతో కష్టపడి ఆ స్థాయికి చేరుకున్నాడు.. అంటూ రవితేజ పై ఫైర్ అవుతున్నారు. కానీ మాస్ రాజా చెప్పింది ఆ ఇంటెన్స్ కాదు.. KGF చేయాలంటే అదృష్టం ఉండాలి, ఆ విషయంలో యష్ లక్కీ అనే సెన్స్‌లో మాట్లాడాడు రవితేజ.
కానీ యష్ ఫ్యాన్స్ మరోలా అర్థం చేసుకున్నారు. ఎందుకంటే.. యష్ మాత్రమే కాదు.. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా, సపోర్ట్ లేకుండా ఎదిగాడు రవితేజ. అసలు సిసలైన సినిమా కష్టాలు పడిన వారిలో రవితేజ టాప్ లిస్ట్‌లో ఉంటాడు. సినిమా కష్టం గురించి తెలిసిన మాస్ రాజాను యష్ ఫ్యాన్స్ అనవసరంగా నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారు. కాబట్టి.. యష్ ఫ్యాన్స్ అర్థం చేసుకుంటే బెటర్.