కోనసీమ: మండపేట మండలం ఆర్తమూరులో SBSR చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత హోమియోపతి వైద్య శిబిరం నిర్వహించారు. 193వ ఉచిత హోమియోపతి శిబిరాన్ని ట్రస్ట్ చైర్మన్ సత్తి బుల్లి స్వామి రెడ్డి ఆదివారం ప్రారంభించారు. ఈ శిబిరంలో బిపి, షుగరు పరీక్షలు నిర్వహించారు. దీర్ఘకాలిక వ్యాధులతో పాటుగా అన్ని రకాల వ్యాధులకు ఈ ట్రస్ట్ ద్వారా ఉచితంగా మందులను పంపిణీ చేశారు.