MBNR: మహబూబ్ నగర్ 23వ డివిజన్ సొసైటీ పరిధిలో వింత పరిస్థితి నెలకొంది. ఓటర్ల జాబితాలో తప్పుల వల్ల ఈ డివిజన్ ఓట్లు 8, 23, 24 డివిజన్లలోకి వెళ్లాయి. దీంతో తమ సమస్యల పరిష్కారం కోసం సొసైటీ ప్రజలు ఆ మూడు డివిజన్ల కార్పొరేటర్లను ఆహ్వానించి సన్మానం చేశారు. డివిజన్ అభివృద్ధి కోసం ముగ్గురు కార్పొరేటర్లు కలిసి పనిచేయాలని స్థానికులు కోరారు.