TG: కరీంనగర్ జిల్లా గండ్రపల్లిలో విషాదం నెలకొంది. గ్రామంలో ఒకరు మృతిచెందిన వెంటనే వారి దశ దినకర్మ పూర్తి కాకుండానే మరొకరు చనిపోతున్నారు. 2 నెలల్లో వరుసగా 25 మంది మృతిచెందినట్లు గ్రామస్తులు తెలిపారు. ఊరికి కీడు సోకిందని గ్రామస్తులు ఊరిని విడిచి వంటలకు వెళ్లారు. ఉదయం 6 నుంచి రాత్రి వరకు కీడు వంటలకు వెళ్లాలని పండితులు సూచించగా, కీడు వంటలకు వచ్చినట్లు గ్రామస్తులు పేర్కొన్నారు.