AP Hates Jagan, Bonda Uma Counter To Why AP Need Jagan Programme
Bonda Uma: వై ఏపీ నీడ్స్ జగన్ ప్రోగ్రామ్‌తో వైసీపీ ముందుకు వెళుతుంది. ప్రజలు మరోసారి తమకు ఎందుకు అధికారం ఇవ్వాలో వైసీపీ నేతలకు సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు. ఆ కార్యక్రమానికి టీడీపీ నేత బోండా ఉమ (Bonda Uma) కౌంటర్ ఇచ్చారు. ఏపీ హేట్స్ జగన్ అంటున్నారని సెటైర్లు వేశారు. సీఎం జగన్‌ను ప్రజలు ఎందుకు ద్వేషిస్తున్నారనే అంశాన్ని ప్రజలకు వివరించాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. జగన్ వద్దు బాబోయ్ అంటున్నారని గుర్తుచేశారు.
నవరత్నాలు కార్యక్రమం కూడా వందకు కేవలం 15 శాతం మందికి మాత్రమే లబ్ది చేకూరిందని బోండా ఉమ (Bonda Uma) వివరించారు. తెచ్చిన రూ.10 లక్షల కోట్లు ఏమయ్యాయో చెప్పాలని కోరారు. ఇందులో రూ.7 లక్షల కోట్లు వైసీపీ నేతల జేబుల్లోకి వెళ్లాయని ఆరోపించారు. వైద్య, విద్యా రంగాలను సీఎం జగన్ భ్రష్టు పట్టించారని ధ్వజమెత్తారు. నిన్నటి వైసీపీ విసృతస్థాయి సమావేశంలో తాను పేదవాడినని అనడం విడ్డూరంగా ఉందన్నారు. దేశంలో ధనిక ముఖ్యమంత్రుల్లో సీఎం జగన్ మొదటి స్థానంలో ఉన్నారని.. ఏడీఆర్ సర్వే ఇదే విషయం చెప్పిందన్నారు. ప్రజలను మోసం చేసేందుకు పేదవాడి ముసుగు వేసుకోవాలని జగన్ చూస్తున్నారని ధ్వజమెత్తారు.
రాష్ట్రాన్ని జగన్ నాశనం చేశారని.. గడప గడపకు వైసీపీ కార్యక్రమంలో నిరసన ఎదురవుతోందని బోండా ఉమ తెలిపారు. ఆ ప్రోగ్రామ్ అడ్డుకోవడంతో బస్సుయాత్ర చేస్తున్నారని నిలదీశారు. దళితుడిని చంపిన అనంతబాబును పక్కన కూర్చొబెట్టుకున్న సీఎం జగన్ దళిత పక్షపాతి ఎలా అవుతారని నిలదీశారు. 600 హామీలు ఇచ్చి.. ఒక్కటి నెరవేర్చని ఘనత సీఎం జగన్‌కు దక్కుతుందని ఎద్దేవా చేశారు.
జే బ్రాండ్ మద్యం కొనలేక రాష్ట్రంలోని పేదవాడి జేబు ఖాళీ అయిపోయిందని విమర్శించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓసీ యువత ఉద్యోగాలు లేకుండా ఉన్నారని వివరించారు. మీకు భయపడి కియా, అమరరాజా, సెల్ కాన్, లూలూ సహా పలు పరిశ్రమలు పక్క రాష్ట్రానికి వెళ్లాయని వివరించారు.