»Senior Tdp Leader Atchannaidu Said That Ap Cm Jagan Is A Traitor Of Bcs
Atchannaidu: సీఎం జగన్ బీసీల ద్రోహి
ఏపీలో అరాచకపాలన కొనసాగుతుందని బీసీలపై జగన్ ప్రభుత్వం అక్కసును వెల్లగక్కుతుందని టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడు అన్నారు. వైసీపీ అవినీతి పాలనకు చరమగీతం పాడే సమయం ఆసన్నమయిందని ధీమా వ్యక్తం చేశారు.
Senior TDP leader Achchennaidu said that AP CM Jagan is a traitor of BCs.
AP Politics: ఆంధ్రప్రదేశ్(Andrapradesh) ముఖ్యమంత్రి జగన్(Jagan) బీసీల ద్రోహి అని టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడు(Atchannaidu) ఆరోపించారు. బడుగు, బలహీనవర్గాలపై ముఖ్యమంత్రి చేస్తున్న అరాచకాన్ని ప్రశ్నిస్తున్న మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులపై అక్రమ కేసులు పెడుతున్నారని గుర్తు చేశారు. అంతేకాదు టీడీపీ శ్రేణులపై వరుస కేసులు బనాయిస్తున్నారని అన్నారు. ఆ కేసులతో ప్రశ్నించేవారిని భయపెట్టి జగన్ తన పెత్తందారి తనాన్ని చూపిస్తున్నారని విమర్శించారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో అక్రమ ఆరోపణలు ఎదుర్కొంటున్న చంద్రబాబునాయుడికి మద్ధతుగా నిరసనలు తెలిపినందుకు వైసీపీ ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతుందని అచ్చెన్నాయుడు మండిపడ్డారు. కావాలనే అన్ని కేసుల్లో మొదటి ముద్దాయిగా చేరుస్తున్నారని వెల్లడించారు.
రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకల సందర్భంగా 2 గంటల పాటు ట్రాఫిక్ జామ్ చేసి..ప్రజల్ని ఇబ్బందులు పెట్టినా వైసీపీ నేతలపై పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోలేదని అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టం అందరికీ సమానమైనప్పుడు కేవలం ప్రతిపక్ష నాయకులపైనే కేసులెందుకని ప్రశ్నించారు. ఆదివారం అర్ధరాత్రి రాయదుర్గం ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఉన్న టీడీపీ దీక్షా శిబిరాన్ని బలవంతంగా ఖాళీ చేయించారని దుయ్యబట్టారు. ప్రతిపక్ష పార్టీలు ఎటువంటి కార్యక్రమానికి పిలుపునిచ్చినా పోలీసులు వెంటనే ముందస్తు అరెస్ట్ లు చేయడం అలవాటుగా మారిందన్నారు. సీఎం జగన్ పోలీసులను వైసీపీ ప్రైవేటు సైన్యంలా..చట్టాన్ని చుట్టంలా మార్చుకుని ఏపీలో అరాచకపాలన కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. బీసీలంటే కనీసం మర్యాద లేదని, ఇకపై వారు గాలి పీల్చుకోవాలన్నా జగన్ అనుమతి తీసుకోవాలేమో అని ఎద్దేవా చేశారు. వైసీపీ అవినీతి పాలనకు చరమగీతం పాడే సమయం ఆసన్నమయిందని, ఏపీ నీడ్స్ జగన్ అని కాకుండా, ఏపీ హేట్స్ జగన్ అని ప్రజలు అంటున్నారని అచ్చెన్నాయుడు అభిప్రాయం వ్యక్తం చేశారు.