స్కిల్ డెవలప్మెంట్ కేసులో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న చంద్రబాబు సుప్రీంకోర్టులో వేసిన క్వాష్ పిటిషన్ వాయిదా పడింది. చంద్రబాబు తరఫు న్యాయవాది, సీఐడీ తరఫు న్యాయవ్యాది వాదనలు విన్న సుప్రీంకోర్టు ఈ కేసును శుక్రవారానికి వాయిదా వేసింది.
The Supreme Court adjourned the quash petition filed by Chandrababu in the skill development case till Friday
Skill development: స్కిల్ డెవలప్మెంట్(skill development) కేసులో టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆ కేసుపై ఏసీబీ కోర్టు విచారణ చేస్తుండగానే..ఆయన తరఫు లాయర్లు స్కిల్ డెవలప్మెంట్ వ్యవహారంలో చంద్రబాబు ఎదుర్కొంటున్న ఆరోపణలపై సుప్రీంకోర్టు(Supreme Court)లో క్వాష్ పిటిషన్(quash petition) దాఖలు చేశారు. తాజాగా ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడింది. చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే, సీఐడీ తరఫున ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. ఇద్దరు న్యాయవాదులు వివిధ అంశాలపై సుదీర్ఘంగా వాదనలు వినిపించారు. 17ఏ సెక్షన్‌కు సంబంధించిన వివిధ అంశాలు, మరికొన్ని కేసుల్లో వచ్చిన తీర్పులను సాల్వే ప్రస్తావించారు. వీరి వాదోపవాదాలు విన్న సుప్రీంకోర్టు భోజన విరామం అనంతరం శుక్రవారానికి విచారణను వాయిదా వేస్తున్నట్లు తెలిపింది.
సీఆర్పీసీలో సెక్షన్ 482 కింద సుప్రీంకోర్టులో గానీ హైకోర్టులో గానీ క్వాష్ పిటిషన్ వేసే వెసలుబాటు ఉంది. తన ప్రమేయం లేకపోయినా కేసులో తప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పుడు క్వాష్ పిటిషన్ ను దాఖలు చేసుకోవడానికి అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం చంద్రబాబు ఎదుర్కొంటున్న కేసులో ఆయనకు స్కిల్ డెవలప్మెంట్ విషయంలో జరిగిన లావాదేవీలకు ఎలాంటి సంబంధం లేదని ఆయన తరఫు లాయరు క్వాష్ పిటీషన్‌ను దాఖలు చేశారు. దీనిపై శుక్రవారం విచారణ జరగనుంది.