»Shabhman Gill Was Admitted To The Hospital Due To Low Platelet Count
Subhman Gil: ఆస్పత్రిలో చేరిన శుభమన్ గిల్.. పాక్ మ్యాచ్‌కు కూడా దూరమేనా?
టీమ్ఇండియా స్టార్ ఒపెనర్ శుభమన్ గిల్ మరో మ్యాచ్‌కు దూరం కానున్నాడు. డెంగీ ఫీవర్‌తో బాధపడుతున్న గిల్ ప్లేట్లెట్స్ కౌంట్ తగ్గిపోవడంతో మళ్లీ ఆసుపత్రిలో చేరాడు.
100 Percent Skill Still Not Been Seen: Shubman Gill
Subhman Gil: వన్డే ప్రపంచ కప్ జరుగుతున్న సమయంలో టీమ్ఇండియాకు మరో షాక్ తగిలింది. ఓపెనర్ శుభమన్ గిల్ మ రికొన్ని మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. డెంగీతో బాధపడుతున్న గిల్ ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి మ్యాచ్‌కు దూరమయ్యాడు. బీసీసీఐ ఎప్పటికప్పుడూ గిల్ ఆరోగ్యాన్ని చెక్ చేస్తూనే ఉంది. ప్రస్తుతం గిల్‌కి ప్లేట్లెట్ కౌంట్ తక్కువగా ఉండటంతో అతనిని చైన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. గిల్ కోలుకోవడానికి కాస్త సమయం పడుతుంది. ఫీవర్ కారణంగా గిల్ రేపు అఫ్గానిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌కి గిల్ అందుబాటులో ఉండటం లేదు.
Shubman Gill hospitalised in Chennai after the platelet count dropped a bit. (PTI).
అహ్మదాబాద్ వేదికగా అక్టోబర్ 14న చిరకాల ప్రత్యర్థులు భారత్, పాక్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ రసవత్తరమైన మ్యాచ్‌కు కూడా గిల్ దూరమయ్యే అవకాశం ఉందని సమాచారం. ఎందుకంటే డెంగీ ఫీవర్‌తో బాధపడుతున్న గిల్ కోలుకోవడానికి కొంత సమయం పడుతుంది. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో గిల్ స్థానంలో ఇషాన్ ఆడగా.. డకౌట్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం శుభమన్ గిల్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఆసియా కప్, ఆస్ట్రేలియా సిరీస్‌లో తన ఆటతో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఫామ్‌లో ఉన్న గిల్ ప్రస్తుతం వన్డే జట్టులో లేకపోవడం టీమ్ఇండియాకు పెద్ద లోటు అని చెప్పుకోవచ్చు.