HYD: మహిళా వ్యాపారవేత్తకు సైబర్ నేరగాళ్లు భారీ టోకరా వేశారు. పోలీసులు తెలిపిన వివరాలు.. ఈనెల 13న దొడ్ల ప్రతాప్ గ్రూప్ డైరెక్టర్ దివ్యారెడ్డి అకౌంటెంట్‌కు వాట్సాప్‌లో డబ్బులు పంపాలని మెసేజ్ వచ్చింది. డైరెక్టర్ దివ్యారెడ్డి ఫొటో డీపీ ఉండటంతో అకౌంటెంట్ దాంట్లో సూచించిన ఖాతాకు రూ.1.20 కోట్లు బదిలీ చేశారు. మరోసారి డబ్బులు పంపించాలని సూచించడంతో మోసం బయట పడింది.