VKB: పెద్దేముల్లోని మంబాపూర్ నుంచి జనగాం మీదుగా మారేపల్లి మార్గంలో పలుచోట్ల కంప చెట్లు రోడ్డుపైకి వచ్చాయి. దీంతో రోడ్డుపై వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి సమయంలో కంపచెట్లతో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. రోడ్ల భవనాల శాఖ అధికారులు స్పందించి రోడ్డుపైకి వచ్చిన ముళ్ల పొదలను తొలగించాలని వాహనదారులు విజ్ఞప్తి చేస్తున్నారు.