JN: జనగామ ఐడీఓసీ సమీపంలోని ఇందిరా మహిళా శక్తి కాంటీన్ను తొలగించవద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. పాలమకుల చిన్న మంజుల, విజయలక్ష్మి 2025 ఆగస్టు నుంచి ‘వనిత టీ స్టాల్’ నిర్వహిస్తున్నారు. సరైన నోటీసు ఇవ్వకుండా తొలగించేందుకు అధికారులు ప్రయత్నించారని వారు ఆరోపించారు. ఈ కేసులో ఏప్రిల్ 1 వరకు యథాతథ స్థితి కొనసాగించాలని కోర్టు తెలిపింది.