భుజం మీద కండువా మార్చినంత ఈజీగా రాజకీయ నాయకులు పార్టీలు మారుతున్నరని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు (Venkaiah Naidu) సంచలన వాఖ్యలు చేశారు. ఈ రోజు హైదరాబాద్ ఎంసీఆర్హెచ్ఆర్డీలో నిర్వహించిన సిటిజన్ యూత్ పార్లమెంట్ (Citizen Youth Parliament)కార్యక్రమానికి వెంకయ్య ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాజకీయాల్లో కోట్లు లేనిదే ఓట్లు రావనే పరిస్థితి ప్రస్తుతం ఏర్పడిందని, అది మారాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఓ వ్యక్తి పార్టీ మారితే ఆ పార్టీలో ఉండగా వచ్చిన పదవికి సైతం రాజీనామా చేయాలన్నారు. యువత రాజకీయాల్లోకి (Politics) రావాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు
రాజకీయాల్లోకి వచ్చేందుకు బ్యాక్ గ్రౌండ్ (Background) అవసరం లేదని, అందులో రాణించేందుకు నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేయాలని సూచించారు. చట్టసభల్లో ఆరోగ్యకరమైన చర్చలు జరిపి ప్రజలకు ఉపయోగపడే చట్టాలు రావాలని ఆకాంక్షించారు. ఓ వ్యక్తి పార్టీ మారితే ఆ పార్టీలో ఉండగా వచ్చిన పదవికి సైతం రాజీనామా చేయాలన్నారు. యువత రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. సిద్ధాంతాల(theories)కు కట్టుబడి చేసే రాజకీయాల వల్ల ప్రజలకు ప్రయోజనం కలుగుతుందని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో హోం మంత్రి మహమూద్ అలీ, టీఎస్ ఎంఐడీసీ ఛైర్మన్ ఎర్రొళ్ల శ్రీనివాస్ సహా పలువురు ప్రమఖులు పాల్గొన్నారు.