ఈసారి యూట్యూబ్ పగిలిపోవాల్సిందేనని.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. క్రిష్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు.. ప్రస్తుతం షూటింగ్ స్టేజ్‌లో ఉంది. సమ్మర్లో ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టీజర్ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటి వరకు వచ్చిన గ్లింప్స్, పవర్ గ్లాన్స్ చూసి.. ఈ సినిమా పై భారీ ఆశలు పెట్టుకున్నారు మెగాభిమానులు. అందుకు తగ్గట్టే ఈ సినిమాకు పని చేసిన టెక్నిషీయన్స్.. క్రిష్ ‘హరిహర వీరమల్లు’ను అద్భుతంగా తెరకెక్కిస్తున్నట్టు అంచనాలు పెంచేస్తున్నారు. అందుకే టీజర్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే మేకర్స్.. రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న టీజర్ రిలీజ్ చేస్తామని చెప్పుకొచ్చారు. ఇప్పుడా సమయం దగ్గర పడింది. మరో ఐదు రోజుల్లో జనవరి 26 రానుంది. దాంతో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు పవన్ ఫ్యాన్స్.
అయితే మేకర్స్ నుంచి టీజర్ పై మరోసారి క్లారిటీ రావాల్సి ఉంది. రేపో, మాపో టీజర్ అప్డేట్ ఉంటుందని అంటున్నారు. ఇక హరిహర వీరమల్లు సినిమాతో పాన్ ఇండియా మార్కెట్లోకి అడుగుపెట్టబోతున్నారు పవర్ స్టార్. ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుండగా.. నర్గీస్ ఫక్రి కీలక పాత్ర పోషిస్తుంది. మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్‌పై ఏ. దయాకర్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా ఎ.ఎం.రత్నం సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. మరి ఈసారైనా హరిహర వీరమల్లు టీజర్ ఉంటుందో లేదో చూడాలి.