TG: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు గోషామహల్ MLA రాజాసింగ్ లేఖ రాశారు. తనకు, తన కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉందంటూ లేఖలో పేర్కొన్నారు. తనకు భద్రత కల్పించాలని కోరారు. కాగా, రాజాసింగ్‌కు పలుమార్లు బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. ఈనెల 27న శ్రీరామ నవమి శోభాయాత్ర నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో 27వ తేదీలోగా రాజాసింగ్‌ను చంపేస్తామంటూ ఆగంతుకులు హెచ్చరించారు.