Actor Missing: సిక్కిం వరదల్లో గల్లంతైన సీనియర్ నటి
సిక్కిం వరదల్లో టాలీవుడ్ సీనియర్ నటి గల్లంతైంది. సిక్కిం పర్యటనకు వెళ్లిన ఆమె ఆచూకీ ఇప్పటికీ లభించలేదని తెలుస్తోంది. ఈ వరదల్లో ఇప్పటికే చాలా మంది ఆర్మీ జవాన్లు గల్లంతవ్వగా వారి కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.
Actor Missing:ఇటీవల సిక్కింలో వచ్చిన ఆకస్మిక వరదల్లో ఓ సీనియర్ నటి గల్లంతైనట్లు తెలుస్తోంది. ఇంతకీ ఎవరీ సీనియర్ నటి అంటే? సీనియర్ ఎన్టీఆర్తో ‘దాన వీర శూరకర్ణ’లో నటించిన సరళ కుమారి సిక్కిం వరదల్లో గల్లంతైయింది. 1983లో మిస్ ఆంధ్రప్రదేశ్గా ఎంపికైన తర్వాత సరళ కుమారి సినీ రంగంలోకి ప్రవేశించారు. ఎన్నో సినిమాల్లో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అయితే సరళ అక్టోబర్ 2న స్నేహితులతో కలిసి సిక్కిం పర్యటనకు వెళ్లి గల్లంతైనట్లు అమెరికాలో ఉన్న ఆమె కుమార్తె నబిత తెలిపారు.
హైదరాబాద్లో హైటెక్ సిటీలో నివసిస్తున్న సరళ ఆచూకీ కనిపెట్టమని నబిత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. సరళ సిక్కిం చేరుకున్నాక నబితతో ఒకసారి మాట్లాడారంటా. అదే చివరిసారిగా మాట్లాడింది. ఆ తర్వాత నుంచి ఆమె ఫోన్ కలవట్లేదని నబిత తెలిపారు. అయితే సిక్కింలో వరదలు వచ్చినట్లు నబిత వార్తలు ద్వారా తెలుసుకుంది. వెంటనే ఆర్మీ హెల్ప్ లైన్ నంబర్లకు కూడా కాల్ చేయగా ఫోన్ కలవడం లేదని నబిత ఆవేదన వ్యక్తం చేసింది. ఎలాగైనా తన తల్లి ఆచూకీ తెలుసుకోమని నబిత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. కుంభవృష్టి కారణంగా ఆకస్మిక వరదల్లో చాలామంది ఆర్మీ జవాన్లు ఇప్పటికే గల్లంతయ్యారు.