ఈ రోజుల్లో చాలా మంది తమ ఆరోగ్యాన్ని సరిగా పట్టించుకోవడం లేదు. సరైన ఆహారపు అలవాట్లు పాటించకపోవడం వల్ల అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. అందులోనూ ఇప్పుడు ఎక్కువ మందిని ఊబకాయం సమస్య వేధిస్తోంది. అధిక బరువుతో చాలా మంది సతమతమవుతున్నారు. కొందరైతే తమ బరువును తగ్గించుకోవడానికి ఎన్నో లక్షల రూపాయలను ఖర్చు చేస్తూ ఉన్నారు. ఇంకొందరైతే ఆపరేషన్లు చేసుకుని ప్రాణాపాయ స్థితికి కూడా చేరుతున్నారు. మరి అలాంటివారు ఇకపై బాధపడాల్సిన పనిలేదు. కేవలం ఒక చక్కటి చిట్కాతో మీరు ఎంతటి పొట్టనైనా వారం రోజుల్లోనే తగ్గించుకోవచ్చు.
ఇందుకోసం మీరు ముందుగా బెల్లం, జీలకర్రను ఉపయోగించాల్సి ఉంటుంది. సాధారణంగా జీలకర్ర బరువును బాగా తగ్గిస్తుంది. ఆహారం జీర్ణం అవ్వడంలోనూ, శరీరంలోని కొవ్వును కరిగించడంలోనూ జీలకర్ర బాగా పనిచేస్తుంది. ఎవరైనా బరువు తగ్గితే ఎముకలు బలహీనంగా మారే అవకాశం ఉంటుంది. జీలకర్ర వల్ల ఎముకలు బలహీనంగా మారకుండా ఆరోగ్యంగా బలంగా తయారవుతాయి.
జీలకర్రలో కాల్షియం అధికంగా ఉండటం వల్ల అది ఎముకల బలానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. జీలకర్రలో చాలా పోషకాలున్నాయి. ఇప్పుడు కొవ్వను కరించుకోవడానికి జీలకర్రను ఏ సమయంలో ఎలా తీసుకోవాలో తెలుసుకుందాం. మనం చేసుకునే రెమిడీని 15 రోజులపాటు క్రమం తప్పకుండా తీసుకుంటే మంచి ఫలితం వస్తుంది.
ముందుగా ఒక స్టవ్ మీద గిన్నె పెట్టి అందులో ఒక గ్లాస్ నీటిని పోసి మరిగించాలి. ఆ తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేసి ఇంకాసేపు మరిగించాలి. ఏడు నిమిషాల మరిగించాక జీలకర్రలోని పోషకాలు నీటిలోకి చేరుకుంటాయి. దీంతో నీళ్లన్నీ పసుపు రంగులోకి మారుతాయి. ఆ తర్వాత ఆ నీళ్లలోకి మనం బెల్లం వేసుకోవాలి. వీలైనంత వరకూ కూడా ఆర్గానిక్ బెల్లం వాడడం ఉత్తమం. బెల్లం వేసిన తర్వాత ఆ నీటిని ఇంకాసేపు మరిగించాలి.
మరిగించిన నీటిని వడగట్టి ప్రతి రోజూ కూడా ఉదయం పరగడుపున తాగడం అలవాటు చేసుకోవాలి. ఆ నీటిని తాగిన అరగంట తర్వాత కాఫీ లేదా టీని తాగొచ్చు. ఇలా చేసుకున్న బెల్లం, జీలకర్ర నీళ్లు మన శరీరంలో పేరుకుపోయిన కొవ్వును వేగంగా కరిగించి వేస్తాయి. ఈ నీటిని కాస్త వేడిగా ఉన్నప్పుడు తాగితే మంచి ఫలితాలు ఉంటాయి.