KKD: ఈ నెల 23న కాకినాడ కలెక్టరేట్లో నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలను అనివార్య కారణాలవల్ల రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ షణ్మోహన్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రజలు, అర్జీదారులు ఈ విషయాన్ని గమనించాలని ఆయన కోరారు. ప్రజా సమస్యల పరిష్కారానికి 1100 కాల్ సెంటర్ సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.