MDCL: గాజులరామారం పరిధి సుభాష్ నగర్, వెంకటాద్రి నగర్, గంపల బస్తి, రాంరెడ్డి నగర్, ఎస్సార్ నాయక్ నగర్ ప్రాంతాల్లో కాలుష్యం రోజురోజుకు తీవ్రంగా పెరుగుతోంది. భూమిలో హానికర రసాయనాలు, వ్యర్థాలు కలవడం వల్ల భూగర్భ జలాలు కూడా కలుషితమవుతున్నాయి. ఇది ప్రజల ఆరోగ్యానికి పెద్ద ముప్పుగా మారుతోంది. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి PCB చర్యలు చేపట్టాలన్నారు.