»Shraddha Kapoor Responded To The Wedding Comments
Shraddha Kapoor: పెళ్లి కామెంట్లపై స్పందించిన శ్రద్ధా కపూర్!
సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయిన బాలీవుడ్ సెలబ్రిటీలలో శ్రద్ధా కపూర్(Shraddha Kapoor) కూడా ఒకరు. ఈ అమ్మడు ఇటివల నిర్వహించిన ఓ చిట్ చాట్ లో ఓ నెటిజన్ ఆమె పెళ్లి గురించి అడుగగా..ఆమె తనదైన శైలిలో స్పందించింది. ఇంతకీ ఏం చెప్పిందో ఇక్కడ చుద్దాం.
బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్(Shraddha Kapoor) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆమె కేవలం బాలీవుడ్ లో మాత్రమే కాదు, తెలుగులోనూ నటించింది. ప్రభాస్ సరసన సాహో మూవీతో తెలుగు ప్రేక్షకులను అలరించింది. అయితే, ఆమె చాలా కాలంగా ఓ వ్యక్తి ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు డేటింగ్ లో కూడా ఉందని పుకార్లు వస్తున్నాయి. కానీ వారి ప్రేమ విషయం గురించి ఇప్పటి వరకు ఆమె అధికారికంగా ప్రకటించలేదు. అయితే, ప్రేమలో ఉందనే విషయం మాత్రం అనేక మందికి తెలుసు.
ఈ మధ్యకాలంలో బాలీవుడ్ లో హీరోయిన్లు అందరూ వరసగా పెళ్లి పీటలు ఎక్కేస్తున్నారు. దీంతో శ్రద్ధాని పెళ్లి(marriage) ఎప్పుడు చేసుకుంటావు అని నెటిజన్లు ప్రశ్నించారు. ఈ క్రమంలో ఆమె దానికి ఆసక్తికరమైన సమాధానం చెప్పారు. శ్రద్ధా సోషల్ మీడియాలో చాలా చురుకుగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఆమె ఇటీవల నెటిజన్లతో చిట్ చాట్ చేసింది. ఆ చిట్ చాట్ లో పెళ్లి ఎప్పుడు చేసుకుంటున్నారని ఓ నెటిజన్ ప్రశ్నించారు.
దానికి ఆమె చాలా ఫన్నీగా స్పందించింది. ‘పదోస్ ఆంటీ, మీరు మీ రియల్ ఐడీ నుంచి నాతో మాట్లాడండి’ అంటూ ఆమె కౌంటర్ ఇచ్చారు. అది ఫేక్ ఐడీ అని గుర్తించడంతో సదరు నెటిజన్ షాకయ్యాడు. అయితే పెళ్లి విషయంపై మాత్రం సమాధానం ఇవ్వకపోవడం విశేషం. ఇది చూసిన పలువురు శ్రద్ధా(Shraddha Kapoor) చాలా తెలివిగా సమాధానం చెప్పకుండా తప్పించుకుందని అంటున్నారు.