KMR: బిక్కనూరు పట్టణ తై బజార్ వేలంపాటను ఈనెల 23న నిర్వహిస్తున్నట్లు గ్రామ సచివాలయ కార్యదర్శి మహేష్ గౌడ్ శనివారం తెలిపారు. వారసంతతో పాటు రోజువారీ సంతలకు ఈ వేలం జరుగుతుందన్నారు. పాల్గొనేవారు రూ.10,000 డిపాజిట్ చెల్లించాలని సూచించారు. ఆసక్తి గల వారు మరిన్ని వివరాల కోసం గ్రామ సచివాలయంలో సంప్రదించాలని కోరారు.