»Prime Minister Modis Speech At A Public Meeting In Gwalior Madhya Pradesh
PM Modi: అభివృద్ధిని చూసి తట్టుకోలేక పోతున్నారు.
విపక్షనేతలు బీజేపీ చేస్తున్న అభివృద్ధిని చూసి తట్టుకోలేకపోతున్నారని బహిరంగ సభలో తీవ్రస్థాయిలో మండిపడ్డ ప్రధాని నరేంద్ర మోడి. వారికి రూట్ మ్యాప్, విజన్ లేదని ఎద్దేవ చేశారు.
Prime Minister Modi's speech at a public meeting in Gwalior, Madhya Pradesh
PM Modi: విపక్ష పార్టీలపై ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అభివృద్ధిని చూసి విపక్షపార్టీలు తట్టుకోవడం లేదని విరుచుకుపడ్డారు. విపక్షాల నేతలకు దేశ అభివృద్ధి విషయంలో విజన్ గానీ ఒక రోడ్‌మ్యాప్ గానీ లేవన్నారు. బీజేపీ హయాంలో దేశంలోని పలు రంగాల్లో జరుగుతోన్న అభివృద్ధిని వారు జీర్ణించుకోవడం లేదన్నారు. ఈ ఏడాది చివర్లో మధ్యప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగతుండగా సోమవారం ప్రధాని మోడీ గ్వాలియర్‌లో పర్యటించారు. రూ.19,260 కోట్లతో చేపట్టే ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రధాని మాట్లాడారు.
భారతదేశంలో బీజేపీ(BJP) చేపట్టిన పనులను చూసి, దేశ అభివృద్ధిని చూసి ప్రపంచమంతా కీర్తిస్తుంటే విపక్షాలు మాత్రం దెబ్బిపొడుస్తున్నారని విమర్శించారు. రాజకీయాల్లో మునిగితేలుతున్న విపక్ష(INDIA) నేతలకు కుర్చీయే తప్ప అభివృద్ధి కనబడటంలేదని ప్రధాని పేర్కొన్నారు. దేశంలో అసలు అభివృద్ధినే జరగట్లేదని నిరూపించేందుకు బీజేపీ వ్యతిరేకులు ప్రయత్నిస్తున్నారన్నారు. తమ డబుల్ ఇంజిన్ ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసం ఉందని, మధ్యప్రదేశ్‌ను వెనుకబడిన కేటగిరీ నుంచి అభివృద్ధిలో దేశంలోఅభివృద్ధి చెందిన తొలి 10 రాష్ట్రాల్లో ఒకటిగా చేర్చింది బీజేపీ పార్టీనే అన్న విషయాన్ని ప్రజలు ఎల్లప్పుడు గుర్తుపెట్టుకుంటారని పేర్కొన్నారు. విపక్షాల పాలనలో ఉన్న రాష్ట్రాల్లో నేరాలు, అవినీతిలతో కూరుకుపోయాయి అని ఆరోపించారు. దేశంలో చేపడుతోన్న అభివృద్ధి పథకాలు, దేశ ప్రగతిని విపక్షాలు ద్వేషిస్తున్నాయన్నారు. కానీ, మౌలిక సదుపాయాల అభివృద్ధే తమ పార్టీ ముఖ్య లక్షణమని తెలిపారు. మధ్యప్రదేశ్‌లో వచ్చే ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. మీ ఒక్క ఓటు మధ్యప్రదేశ్‌ను దేశంలోనే మూడో స్థానానికి తీసుకెళ్తుందంటూ మోడీ ప్రసంగించారు.