SRCL: దేశ స్వాతంత్యర ఉద్యమ కాలంలో బంకించంద్ర ఛటర్జీ రచించిన వందేమాతరం గేయం 150 ఏళ్లు అయిన సందర్భంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో వందేమాతరం గేయాలపన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. వందేమాతరం గేయాలపన కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించగా, ఇంఛార్జ్ కలెక్టర్ గరిమ అగ్రవాల్, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్‌లు గీతాలాపన చేశారు.